స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉన్న సమంత.. లేటెస్ట్గా తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. మరి సమంత ఏం చెప్పంది?
Samantha: నాగ చైత్యనతో విడాకుల తర్వాత మానసికంగా కుంగిపోయిన సమంత.. హెల్త్ ప్రాబ్లమ్స్ గట్టిగానే ఫేజ్ చేయాల్సి వచ్చింది. అరుదైన వ్యాధి మయోసైటిస్ బారిన పడి.. చికిత్స కోసం ప్రస్తుతం సినిమాలన్నీ వదిలేసి వెకేషన్స్ ఎంజాయ్ చేస్తోంది సమంత. అయితే.. రీసెంట్‌గానే సిటాడెల్ డబ్బింగ్ స్టార్ట్ చేసింది సమంత. అందుకు సంబంధించిన అప్డేట్ తనే స్వయంగా అందించింది. ప్రస్తుతం సామ్ చేతిలో సిటాడెల్ వెబ్ సిరీస్ ఒక్కటే ఉంది. దీంతో సామ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి? అసలు హీరోయిన్గా సినిమాలు చేస్తుందా? అనే డౌట్స్ ఉండేవి. ఫైనల్‌గా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది సమంత. తాను తీసుకున్న ఏడాది టైం అయిపోయిందని, త్వరలోనే షూటింగ్స్ మొదలు పెట్టనున్నట్లు తెలిపింది.
తన ఇన్స్‌స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసింది సమంత. ‘కొన్ని రోజులుగా తిరిగి ఎప్పుడు షూటింగ్లో పాల్గొంటారు అని చాలామంది అడుగుతున్నారు. కానీ ఆ రోజులు దగ్గరలోనే ఉన్నాయి. త్వరలోనే నేను షూటింగ్లో పాల్గొనబోతున్నానని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. ఇన్ని రోజులు జాబ్ లెస్‌గా ఉన్నా.. ఇప్పుడు పని చేయాల్సిన సమయం రానే వచ్చేసిందని చెప్పింది. అలాగే.. నా హెల్త్ గురించి నా ఫ్రెండ్స్ తో కలిసి ఒక పాడ్ కాస్ట్ ప్రోగ్రాం కూడా చేశాము.. త్వరలోనే అది రిలీజ్ కానుంది’.. అంటూ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పుకొచ్చింది. దీంతో సామ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. అమ్మడు నెక్స్ట్ ఎవరితో సినిమా చేయబోతోందని వెయిట్ చేస్తున్నారు. మరి సమంత నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటనేది తెలియాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.