తమిళ స్టార్ హీరో విక్రమ్ చియాన్‌కు జోడీగా మీనాక్షి చౌదరి నటించనున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు మడోన్ అశ్విన్‌తో విక్రమ్ ‘చియాన్ 63’ వర్కింగ్ టైటిల్‌తో సినిమా చేస్తున్నారు. ఇందులో కథానాయికగా మీనాక్షిని మేకర్స్ ఎంపిక చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.