ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ ఈనెల 5న విడుదల కానుంది. ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. తాజాగా మరో రేర్ ఫీట్ సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్‌లో రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. కాగా, బుధవారం రాత్రి ప్రీమియర్ షోలతో పుష్ప సందడి ప్రారంభం కానుంది.