»Eagle Review First Review Of Eagle Which Has Gone Viral
Eagle Review: వైరల్‌గా మారిన ‘ఈగల్’ ఫస్ట్ రివ్యూ!
సంక్రాంతికి రావల్సిన రవితేజ ఈగల్ సినిమా ఫైనల్‌గా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడప్ చేసిన మేకర్స్.. రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా నిర్వహించారు. ఇక ఇప్పుడు ఈగల్ ఫస్ట్ రివ్యూ కూడా వచ్చేసింది.
Eagle Review First review of 'Eagle' which has gone viral!
Eagle Review: మాస్ మహారాజా రవితేజ, అనుపమ పరమేశ్వరన్ జంటగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈగల్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 9న రిలీజ్ అవుతుంది. వాస్తవానికైతే.. ఈసారి సంక్రాంతికి గుంటూరు కారంతో మహేష్ బాబు, సైంధవ్‌తో వెంకటేష్, నా సామీ రంగాతో నాగార్జున, తేజ సజ్జా హనుమాన్తో పోటీగా రవితేజ ఈగల్ కూడా రిలీజ్ కావాల్సింది. కానీ థియేటర్ల సమస్య వల్ల జనవరి 13 నుంచి ఈగల్ వెనకడుగు వేసింది. సంక్రాంతి సినిమాల ప్రొడ్యూసర్స్ అంతా కలిసి రవితేజను రిక్వెస్ట్ చేయగా.. ఫిబ్రవరి 9కి ఈగల్‌ను వాయిదా వేసుకున్నాడు. ఇప్పుడు రిలీజ్ డేట్ దగ్గరపడడంతో ప్రమోషన్స్ గట్టిగానే చేస్తున్నారు.
రీసెంట్గా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో రవితేజ మాట్లాడుతూ.. ఈగల్ మంచి సినిమా అని, అందరికి నచ్చుతుందని.. తన గెటప్ విషయంలో ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా ఉంటుందోనని.. తాను కూడా వెయిట్ చేస్తున్నానని చెప్పాడు. ఇక ఇప్పుడు ఈగల్ ఫస్ట్ రివ్యూ కూడా రవితేజనే ఇవ్వడం విశేషం. ఈగల్ సినిమాని చిత్ర యూనిట్‌తో కలిసి స్పెషల్ షో చూశారు మాస్ రాజా రవితేజ. ఈ సందర్భంగా ‘నేను సూపర్ సాటిస్ఫైడ్..’ అని చెప్పుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియోని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఈగల్ ఫస్ట్ రివ్యూ వైరల్‌గా మారింది. ఫస్ట్ రివ్యూ మాస్ మహారాజా నుంచే వచ్చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. మరి రవితేజ చెప్పినట్టుగా ఈగల్ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.