బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, దర్శకుడు ఆదిత్య ధర్ కాంబోలో తెరకెక్కిన సినిమా ‘ధురంధర్’. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ మూవీకి రణ్వీర్ భార్య, బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె రివ్యూ ఇచ్చింది. 3:34 గంటల ఈ సినిమాలోని ప్రతి నిమిషం విలువైనదేనని తెలిపింది. చిత్రయూనిట్ అంతా కలిసి మూవీని విజయంతం చేశారని పేర్కొంది.