TG: ఇవాళ 63వ తెలంగాణ హోంగార్డ్స్ రైజింగ్ కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసు పరేడ్ గ్రౌండ్లో హోంగార్డ్స్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుంది. హోంగార్డుల సేవలను గుర్తించి వారికి అధికారులు ప్రశంసాపత్రాలు అందించనున్నారు. ఈ సందర్భంగా వారికి సీఎం రేవంత్ రెడ్డి వరాలు ప్రకటిస్తారని టాక్.