E.G: నరసాపురంలో పలు ఎరువుల దుకాణాలతో పాటు సొసైటీ గౌడౌన్లో శుక్రవారం వ్యవసాయశాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆ శాఖ ఏడీఏ ప్రసాద్ జీవన్, ఏవో జ్యోషిలాలు పలు రికార్డులు పరిశీలించారు. స్టాక్ వివరాలు, నిల్వలు, నోటీస్ బోర్డులను పరిశీలించారు. ఈ 2 రోజుల్లో 17 దుకాణాల్లో తనిఖీలు చేశారు. నిబంధనలకు అనుగుణంగా ఎరువులు, పురుగుల మందులు విక్రయించాలన్నారు.