GDL: అలంపూర్లో వెలసిన జోగులాంబ దేవి ఆలయ అభివృద్ధి కోసం రూ.347 కోట్లతో ప్రణాళికను రూపొందించారు. శుక్రవారం సచివాలయంలో ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి, దేవాదాయ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ఆలయ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ ప్రణాళికను వివరిస్తామని తెలిపారు.