SKLM: బూర్జ మండలం కొండపేటలో శుక్రవారం రాత్రి ఇద్దరు రైతులకు చెందిన సుమారు 4 ఎకరాల వరికుప్పలు దగ్ధమయ్యాయి. గ్రామస్థుల వివరాలు మేరకు ఇటీవల వరి పంటను కుప్పలుగా పెట్టిన తరుణంలో గుర్తుతెలియని వ్యక్తులు వీటికి నిప్పు పెట్టడంతో అగ్నికి ఆహుతయ్యాయి. సుమారు రూ.2లక్షలు నష్టం జరిగి ఉండొచ్చని రైతులు శ్రీరాములు, సూర్యనారాయణ వాపోతున్నారు.