»Double Ismart Postponement Of Double Ismart New Release Date Fix
Double Ismart: ‘డబుల్ ఇస్మార్ట్’ వాయిదా? కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్?
పూరి జగన్నాథ్‌కు డూ ఆర్ డై సిట్యూవేషన్‌లో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. ఈ సినిమా ఏ మాత్రం తేబా కొట్టిన సరే.. పూరి పరిస్థితి మాత్రం చెప్పుకోకుండా ఉంటుంది. అందుకే డబుల్ ఇస్మార్ట్‌ను పకడ్బందీగా తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా వాయిదా పడినట్టుగా తెలుస్తోంది.
Double Ismart: మామూలుగా అయితే పూరి జగన్నాథ్.. ముందే రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి.. జెట్ స్పీడ్‌లో షూటింగ్ పూర్తి చేసి అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ చేస్తు ఉంటాడు. అయితే.. ఇదంతా లైగర్‌కు ముందు మాత్రమే. ఏ డైరెక్టర్ కూడా చేయనంత స్పీడ్‌గా తక్కువ సమయంలో అదిరిపోయే అవుట్ పుట్ ఇచ్చే పూరి.. లైగర్ విషయంలో మాత్రం రెండు మూడేళ్ల టైం తీసుకున్నాడు. కరోనా మహమ్మరి కారణంగా లైగర్ డిలే అయిందనుకుంటే.. కంటెంట్ పరంగా కూడా ఫెయిల్ అయిపోయాడు పూరి. దీంతో నెక్స్ట్ సినిమాతో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలని చూస్తున్నాడు.
కొత్త కథతో రిస్క్ చేయకుండా ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా అనౌన్స్మెంట్ రోజే రిలీజ్ డేట్ లాక్ చేశాడు పూరి. మార్చి 8న డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ చేస్తామని అనౌన్స్ చేశాడు. అందుకు తగ్గట్టే యమా స్పీడ్‌గా మీద షూటింగ్ చేస్తున్నాడు. అయినా కూడా అ సినిమా వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. షూటింగ్ డిలే కారణంగా మరింత వెనక్కి వెళ్లినట్టుగా సమాచారం. ఏకంగా మూడు నెలలు వాయిదా పడిందట.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. డబుల్ ఇస్మార్ట్ మార్చి 8 నుంచి జూన్ 14కి పోస్ట్‌పోన్ అయినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను అఫిషీయల్‌గా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలో రామ్ పోతినేని సరసన కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తుండగా.. ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. మరి డబుల్ ఇస్మార్ట్ ఎలా ఉంటుందో చూడాలి.