పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ కల్కి 2898 ఏడీ. ఈ సినిమా నుంచి లేటెస్ట్గా ఓ వీడియో లీక్ అయిందని.. అది మామూలుగా లేదని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కానీ లీక్డ్ పిక్స్ మాత్రం మామూలుగా లేవు.
Kalki: మే 9న థియేటర్లో ప్రభాస్ కల్కి అవతారం చూడబోతున్నాం. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కల్కి 2898 ఏడీ మూవీని తెరకెక్కిస్తున్నాడు. కల్కితో మరో కొత్త ప్రపంచాన్ని ఆడియెన్స్‌కు చూపించబోతున్నాడు. ఊహకందని విధంగా కల్కిని విజువల్ వండర్‌గా రూపొందిస్తున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమాతో ప్రభాస్ హాలీవుడ్‌ని రీచ్ అవడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ప్రమోషన్స్ కూడా హాలీవుడ్ నుంచే స్టార్ట్ చేశారు మేకర్స్. అయితే.. ఇప్పటి వరకు కల్కి నుంచి ఓ గ్లింప్స్ మాత్రమే రిలీజ్ అయింది.
ఇది చూసిన తర్వాత నాగ్ అశ్విన్ విజువల్ పరంగా చాలా క్లారిటీగా ఉన్నట్టుగా అనిపించింది. అలాగే.. గ్రాఫిక్స్ పరంగా కల్కి ఓ అద్భుతం అని చెప్పేశాడు. దీంతో ఈ సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఇక ఇప్పుడు కల్కి లీకేజి ఒకటి హైప్‌ని పీక్స్‌కు తీసుకెళ్లింది. ప్రస్తుతం కల్కి షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు నాగ్ అశ్విన్. కొన్ని కీలక సన్నివేశాలను తెరకేక్కిస్తున్నాడు. ఈ నేపథ్యంలో.. ఓ సీన్‌కు సంబందించిన ఫోటోలు సెట్ నుంచి లీక్ అయ్యాయి. ప్రజెంట్ ఆ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
ఫోటోలే కాదు వీడియో కూడా లీక్ అయినట్టుగా తెలుస్తోంది. కాకపోతే ఆ వీడియోని వైరల్ కాకుండా చిత్ర యూనిట్ జాగ్రత్త పడినట్టుగా సమాచారం. సూపర్ సోల్జర్స్ ఉన్న ఈ లీక్డ్ వీడియో మాత్రం మామూలుగా లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అయితే.. ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఈ లీక్స్ విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి జరగకుండా మేకర్స్ జాగ్రత్తలు తీసుకోవాలని అంటున్నారు. అయినా కూడా లీకులు మాత్రం ఆపలేకపోతున్నారు. ఏదేమైనా.. రోజు రోజుకి కల్కి పై అంచనాలు పెరిగిపోతున్నాయి.