పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నారు. బ్రో, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి, హరిహర వీరమల్లు చేస్తున్నారు. వీటిలో హరిహర వీరమల్లుని పక్కకు పెట్టేసి.. మిగతా సినిమాలను పరుగులు పెట్టిస్తున్నాడు పవర్ స్టార్. అయితే ఓజి మాత్రం జెట్ స్పీడ్‌తో దూసుకుపోతోంది. కానీ ఈ సినిమాలో ఓ బ్యూటీని వద్దంటే వద్దంటున్నారు పవన్ ఫ్యాన్స్.
హరిహర వీరమల్లు(Harihara veeramallu) పరిస్థితి ఏంటో.. ఇటు మేకర్స్‌కు అటు పవన్ ఫ్యాన్స్‌కు అర్థం కావడం లేదు. అసలు ఈ సినిమా ఎప్పటికీ కంప్లీట్ అవుతుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ మిగతా సినిమాలు నువ్వా నేనా అన్నట్టుగా దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా సుజీత్ దర్శకత్వంలో వస్తున్న ఓజీ పై భారీ అంచనాలున్నాయి. వీలైనంత వేగంగా ఈ సినిమాను కంప్లీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ముంబైలో షూటింగ్ స్టార్ట్ చేసి పరుగులు పెట్టిస్తున్నారు. ప్రస్తుతం పవన్ షూటింగ్లో పాల్గొంటున్న సినిమా ఇదే అంటున్నారు. ఈ క్రమంలో ఓజి ఐటెం సాంగ్‌కు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ సినిమాలో పవర్ స్టార్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తోంది. కానీ పాన్ ఇండియా టచ్ ఇచ్చేందుకు.. బాలీవుడ్ బ్యూటీ జాక్వెలీన్ ఫెర్నాండెజ్‌తో ఐటెం సాంగ్ చేయించే ఆలోచనలో ఉన్నారట. కానీ జాక్వెలీన్ వద్దు బాబోయ్ అంటున్నారు పవన్ ఫ్యాన్స్. సుజీత్‌తో ప్రభాస్ చేసిన ‘సాహో’ మూవీలో జాక్వెలీన్ స్పెషల్ సాంగ్ చేసింది. ఆ సినిమా ఫ్లాప్ అయింది. సాహో తర్వాత సుజీత్ చేస్తున్న సినిమా ఇదే.
అందుకే ఈ బోల్డ్ బ్యూటీని సోషల్ మీడియా వేదికగా వద్దంటే వద్దంటున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్‌గా వస్తున్న ఈ సినిమాను.. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు భారీ అంచనాలున్నాయి. వచ్చే అక్టోబర్ వరకు ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి.. ఈ ఏడాదిలోనే రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే పవన్ నుంచి ముందుగా జూలై 28న వినోదయ సీతమ్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘బ్రో’ సినిమా థియేటర్లోకి రానుంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తుంండగా.. కేతికా శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.