యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్రెండ్షిప్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఇద్దరు బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో కలిసి నటించారు. అయితే రీల్ లైఫ్ కంటే రియల్ లైఫ్‌లో ఈ ఇద్దరి స్నేహం.. మెగా, నందమూరి అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తోంది.
ఇక ఇప్పుడు ఎన్టీఆర్.. చరణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ విషయంలో కీ రోల్ ప్లే చేసినట్టు తెలుస్తోంది. ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నాడని చాలా రోజులుగా వినిపిస్తోంది. కానీ రోజు రోజుకి లేట్ అవుతుడడంతో.. బుచ్చిబాబు, చరణ్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే అసలు మ్యాటర్ వేరే ఉందంటున్నారు.
ఎన్టీఆర్‌తో వర్కౌట్ కాక బుచ్చి బాబు.. చరణ్ దగ్గరికి వెళ్లలేదట.. స్వయంగా ఎన్టీఆర్‌నే ఆ దర్శకుడిని రామ్ చరణ్ దగ్గరికి పంపిచాడట. బుచ్చిబాబు తనకు చెప్పిన కథ.. రామ్ చరణ్‌కు అయితే బాగుంటుందని భావించాడట తారక్. ఇదే విషయం చరణ్‌తో చెప్పి.. బుచ్చిబాబుని తన దగ్గరికి పంపించాడట ఎన్టీఆర్. ఇక బుచ్చిబాబు చెప్పిన స్టోరీ మెగా పవర్ స్టార్‌కు బాగా నచ్చిందని..
దాంతో వెంటనే ఈ ప్రాజెక్ట్‌కు పచ్చ జెండా ఊపాడని అంటున్నారు. త్వరలోనే చరణ్-బుచ్చిబాబు ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా చరణ్ కెరీర్లో 16వ ప్రాజెక్ట్ కానుంది. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ఆర్సీ15 ప్రాజెక్ట్ చేస్తున్నాడు చరణ్. వాస్తవానికైతే ఆర్సీ 16.. జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో ఉండాల్సింది.
కానీ గౌతమ్ ఫుల్ స్క్రిప్టుతో చరణ్‌ను మెప్పించలేకపోయాడు. అందుకే ఇప్పుడు బుచ్చిబాబుతో సెట్ అయిందని చెప్పొచ్చు. మరి ఎన్టీఆర్ రెఫరెన్స్‌తో చరణ్‌తో ఛాన్స్ కొట్టేసిన బుచ్చిబాబు.. రామ్ చరణ్‌ను ఎలా హ్యాండిల్ చేస్తాడో చూడాలి.