మహేష్ బాబు రిజెక్ట్ చేసే కథలను.. ఇతర హీరోలు చేసి హిట్ కొడుతున్నారు. తనకు అలాంటి సినిమాలు సూట్ అవ్వవని మహేష్ చెప్పడంతో.. వేరే హీరోలను చూసుకుంటున్నారు సదరు దర్శకులు. ఇప్పుడు మరో సినిమా కూడా మహేష్ రిజెక్ట్తోనే రాబోతోంది.
Mahesh: ఇండస్ట్రీలో కథలు చేతులు మారడం కామన్. ఓ హీరోకి నచ్చిన కథ మరో హీరోకి నచ్చదు. పైగా తమకు ఆ కథ సూట్ అవకపోతే.. మరో హీరోకి రెఫర్ చేస్తారు కూడా. నెక్స్ట్ రామ్ చరణ్ చేయనున్న బుచ్చిబాబు సినిమా ఎన్టీఆర్ రెఫరెన్స్‌తో సెట్ అయింది. మహేష్ బాబు మాత్రం వరుస సినిమాలు రిజెక్ట్ చేస్తున్నాడు. వన్ నేనొక్కడినే సినిమా తర్వాత పుష్ప సినిమాను మహేష్‌తో చేయాలనుకున్నాడు సుకుమార్. సూపర్ స్టార్ రిజెక్ట్ చేయడంతో.. అరె మహేష్ మంచి హిట్ మిస్ అయ్యాడని అనుకున్నారు. పూరి డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జనగణమన’ కూడా రీజెక్ట్ చేశాడు మహేష్. ఇక ఇప్పుడు మరో సినిమాను కూడా మహేష్ మిస్ అయ్యాడనే టాక్ నడుస్తోంది.
అర్జున్ రెడ్డితో సాలిడ్ హిట్ కొట్టిన సందీప్ రెడ్డి వంగ.. ప్రస్తుతం బాలీవుడ్లో యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు. రీసెంట్గా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేయగా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇదే కథను గతంలో సందీప్, మహేష్‌కి చెప్పినట్టుగా చెబుతున్నారు. కానీ వైలెన్స్ ఎక్కువగా ఉందని నో చెప్పాడట మహేష్. దాంతో.. అదే కథతో రణ్‌బీర్ కపూర్‌తో యానిమల్ తీసాడని అంటున్నారు. ఈ సినిమా టీజర్ ప్రకారం.. రిచ్ లైఫ్ అండ్ ఫాదర్, సన్ రిలేషన్‌షిప్‌ను చాలా డెప్త్‌గా చూపింబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి వైలెన్స్ సినిమాను మహేష్ బాబు చేసి ఉంటే.. దాని ఇంపాక్ట్ మామూలుగా ఉండేది కాదు.
పైగా రిచ్ లైఫ్ స్టోరీ కాబట్టి.. ప్రిన్స్‌కు అదిరిపోయేది. మహేష్ మాత్రం ఇలాంటి సినిమాలను పక్కకు పెట్టేస్తున్నాడు. ఒకవేళ యానిమల్ హిట్ అయితే.. మహేష్ ఓ మంచి హిట్‌ను చేజేతులా మిస్ చేసుకున్నట్టే అవుతుంది. రాజమౌళి ప్రాజెక్ట్ తర్వాత సందీప్ రెడ్డితో మహేష్ బాబు ఓ సినిమా చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అప్పటి వరకు లెక్కలన్నీ మారిపోతాయి. కాబట్టి.. ఈ క్రేజీ కాంబో ఖచ్చితంగా ఉంటుందని చెప్పలేం. యానిమల్ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. మరి ఈసారి సందీప్ రెడ్డి ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడో చూడాలి.