ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ‘అన్స్టాపబుల్’ కార్యక్రమంలో పాల్గొన్న అల్లు అర్జున్.. తన సీక్రెట్ వాట్సాప్ గ్రూప్ గురించి బయటపెట్టాడు. ఆ వాట్సాప్ గ్రూప్లో కేవలం తను, తన సతీమణి మాత్రమే సభ్యులుగా ఉన్నట్లు తెలిపాడు. గొడవలు, దాని తర్వాత జరిగే చర్చలు ఇందులో ఉంటాయని.. ఇతరుల గురించిన రహస్యాలు కూడా ఈ గ్రూప్లో మాట్లాడుకుంటామని చెప్పుకొచ్చాడు.