AP: శాసనమండలిలో మళ్లీ రగడ నెలకొంది. YCP సభ్యులను ఉద్దేశిస్తూ.. వంద ఎలుకలు తిన్న పిల్లి.. హజ్ యాత్రకు వెళ్లినట్లు అనే సామెతను మంత్రి సత్యకుమార్ ఉపయోగించారు. హజ్ యాత్ర పేరు ఎత్తడంపై వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. మంత్రి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సత్యకుమార్ కేవలం సామెత చెప్పారని.. ఎవరినీ ఉద్దేశించి కాదని మంత్రి అచ్చెన్నాయుడు వివరించే ప్రయత్నం చేశారు. మండలి రగడ నేపథ్యంలో సభ 5 నిమిషాలు వాయిదా పడింది.