AP: విశాఖ స్టీల్‌ప్లాంట్ అంశంపై శాసనమండలిలో చర్చ జరుగుతోంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేసింది. సెయిల్‌లో విలీనం, ఉద్యోగులకు జీతాలు ఇవ్వకపోవడం ప్రైవేటీకరణకు అడుగులు వేయడమే అని వైసీపీ కళ్యాణి ఆరోపించారు. ఈ అంశంపై మంత్రి టీజీ భరత్ స్పందించారు. ప్రైవేటీకరణ ఉద్దేశమే లేదని తెలిపారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.