విశాఖ: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇన్ఫిబినెట్ సేవలను పూర్తిస్థాయిలో విద్యార్థులకు, పరిశోధనలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఇన్ఫీబినెట్ సైంటిస్ట్ అభిషేక్ కుమార్ ఏయూ వీసీ ఆచార్య జి. శశిభూషణరావు, రిజిస్ట్రార్ ఆచార్య ఇ.ఎన్ ధనుంజయరావులతో సమావేశమై ప్రాధాన్యతను వివరించారు. త్వరలో ఇన్ఫిబినెట్తో ఏయూ ఎంఓయూ చేసుకోనుంది.