AP: భూముల రీసర్వేపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి అనగాని సమాధానమిచ్చారు. భూముల రీసర్వే పేరుతో దోపిడీకి గత ప్రభుత్వం కుట్రలు చేసిందన్నారు. అధికారులపై ఒత్తిడి తెచ్చి సర్వే పేరిట అక్రమాలు చేయించారని మండిపడ్డారు. గతంలో రూ.900 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేశారని విమర్శించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు సరిదిద్దాలని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. రీసర్వేపై ఇప్పటివరకు 79 వేల ఫిర్యాదులు వచ్చినట్లు తెలిపారు.