SKLM: ఈనెల 26వ తేదీన శ్రీకాకుళం జిల్లా కలెక్టరేట్ వద్ద నిర్వహించబోయే ధర్నాను జయప్రదం చేయాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆయన రణస్థలం మండలం పైడిభీమవరంలో ధర్నాకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు.