ప్రకాశం: చిన్నగంజాం మండలం సంతరావూరు గ్రామానికి చెందిన నేరస్థుడికి పోక్సో కేసులో గురువారం యావజ్జీవ కారాగార శిక్ష పడింది. రెండో తరగతి చదువుతున్న చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడినందుకు నిందితుడిపై 2018లో కేసు నమోదైంది. ఆరేళ్ల పాటు విచారణ అనంతరం ఒంగోలు 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి రాజా వెంకటాద్రి నేరస్థుడికి రూ.10 వేల జరిమానా విధించారు.