ఏలూరు: పోలవరం గ్రామంలో కన్నాపురం అడ్డరోడ్డు వద్ద కళ్యాణ మండపంలో గురువారం గిరిజన తెగల హక్కులు చట్టాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం తహసీల్దార్ సాయి రాజు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి నెల 30వ తేదీన పోలీస్ రెవెన్యూ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన చేయడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.