AP: YCP ప్రభుత్వ హయాంలో మద్యం బ్రాండ్లపై చంద్రబాబు విష ప్రచారం చేశారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు హామీ ఏమైంది? అని ప్రశ్నించారు. గతంలో ఉన్న బ్రాండ్స్ ప్రస్తుతం వైన్ షాపుల్లో ఉన్నాయన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ఉన్న ధరలే ఇప్పుడూ ఉన్నాయన్నారు. మద్యం ధరలు తగ్గిస్తామన్న చంద్రబాబు హామీ ఏమైంది? అని మండిపడ్డారు.