NRPT: క్రీడలు ఆడటం ద్వారా మానసిక ఉల్లాసం లభిస్తుందని, శరీరం దృఢంగా మారుతుందని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. గురువారం నారాయణపేట మినీ స్టేడియం మైదానంలో జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కలెక్టరేట్ సిబ్బంది జట్టు, పోలీసుల జట్టు మధ్య నిర్వహించిన క్రికెట్ మ్యాచ్ను ప్రారంభించారు. కాసేపు క్రికెట్ ఆడి ఉత్సాహపరిచారు.