ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా గాయపడ్డ యువ ఆటగాడు శుబ్మన్ గిల్ రోజురోజుకు మెరుగవుతున్నాడని టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు. పెర్త్ టెస్టుకు అతడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందంటూ అభిమానులకు శుభవార్త అందించాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆస్ట్రేలియాతో ఐదు టెస్టులు ఆడనుంది. రేపటి నుంచి ఈ మెగా సిరీస్ మొదలుకానుంది.