AP: కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటు చేసేందుకు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. శాసనసభలో మైనారిటీ శాఖ మంత్రి మహ్మద్ ఫరూఖ్ దీన్ని ప్రవేశపెట్టారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని సుదీర్ఘకాలంగా ప్రజల నుంచి డిమాండ్ ఉంది. కాగా, భాషా ప్రాతిపదికన మొదట ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా ఉండేది.