TG: రాష్ట్రంలో రానున్న వారం రోజులు ఉష్ణోగ్రతలు మరింత తగ్గనున్నట్లు వాతావరణశాఖ వెల్లడించింది. 15 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆరోగ్యశాఖ పలు సూచనలు చేసింది. శీతల సమయాల్లో ఇన్ఫ్లూయెంజా పంజా విసిరే అవకాశం ఉన్నట్లు తెలిపింది. చిన్నపిల్లలు, గర్భిణీలు, వృద్ధులు, శ్వాస సంబంధిత రోగులు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. జలుబు, జ్వరం, ఒళ్లు నొప్పులు ఇన్ఫ్లూయెంజా లక్షణాలుగా పేర్కొంది.