TG: మహబూబాబాద్ జిల్లా మానుకోటలో బీఆర్ఎస్ సభకు అనుమతి నిరాకరించిన పోలీసులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై స్పందించిన మాజీ మంత్రి కేటీఆర్.. ఇది ప్రజాపాలన ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ నిర్బంధ పాలన, నిరంకుశ పాలన, కంచెల పాలన.. మొత్తంగా రాక్షస పాలన అని మండిపడ్డారు. ‘ఖబడ్దార్ రేవంత్.. ఇది తెలంగాణ.. ఎంత అణచివేస్తే అంత తిరుగుబాటు వస్తుంది’ అని హెచ్చరించారు.