పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ ఎమోషనల్ అయ్యాడు. డైరెక్టర్ సుకుమార్ లేకపోతే తాను లేనని చెప్పారు. తాను ఈ స్థాయికి రావడానికి సుకుమారే కారణమని తెలిపారు. తన ఫ్యాన్స్ అంటే తనకు పిచ్చి అని ఇంతకన్నా ఇంకేమీ చెప్పలేనన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవిలకు థాంక్యూ చెప్పారు. ఈ సినిమా వీళ్లు కాకుండా ఇంకా ఏ ప్రొడ్యూసర్ చేసినా అయ్యేది కాదని ప్రశంసలు కురిపించారు.