గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. తాజాగా ఈ మూవీ పాటల బడ్జెట్‌కు సంబంధించిన న్యూస్ ఒకటి బయటకొచ్చింది. ఈ మూవీలో మొత్తం ఐదు పాటలు ఉన్నాయి. అయితే ఈ సాంగ్స్ షూట్ కోసం రూ.75 కోట్లు ఖర్చు పెట్టారట. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన నాలుగు పాటలు మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ఇక ఈ సినిమా 2025 జనవరి 10న విడుదలవుతుంది.