థియేటర్ల వద్ద రివ్యూలు ఇచ్చే వారిని అనుమతించకూడదని కోలీవుడ్ నిర్మాతల మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు థియేటర్ యజమానులకు కీలక సూచనలు చేసింది. దీనిపై నిర్మాత దిల్ రాజు స్పందించాడు. తెలుగు రాష్ట్రాల్లోనూ అది అమలు అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలిపాడు. అయితే, అది వ్యక్తిగతంగా తీసుకునే నిర్ణయం కాదని.. ఫిల్మ్ ఛాంబర్ తీసుకోవాలని పేర్కొన్నాడు. ఇప్పటికే అలా చేసేందుకు ఎగ్జిబిటర్లు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలిపాడు.