ప్రకాశం: బల్లికురవ మండలంలోని పలు గ్రామ సచివాలయాలను మండల ఎంపీడీవో కుసుమ కుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. సిబ్బంది క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్ళినప్పుడు తప్పని సరిగా రిజిస్టర్లో నమోదు చేయాలని తెలిపారు. సిబ్బంది సచివాలయంలో అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందించాలన్నారు.