TG: హైదరాబాద్లో నిర్వహించిన లోక్ మంథన్ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయ మూలాలకు తిరిగి వెళ్లాలని అన్నారు. గిరిజన సంప్రదాయ వాయిద్యాలను గుర్తించుకోవాలి, కాపాడుకోవాలని తెలిపారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు ప్రజ్ఞా వాహ్ ఆధ్వర్యంలో లోక్ మంథన్ను ఏర్పాటు చేయటం గొప్ప విషయమని అన్నారు.