ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ AR రెహమాన్, తన భార్య సైరా బాను విడాకులు తీసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అదే రోజు రెహమాన్ బృందంలోని మోహినిదే కూడా తన భర్తతో డైవర్స్ తీసుకుంటున్నట్లు తెలిపారు. దీంతో ఈ రెండు విడాకులకు ఏమైనా సంబంధం ఉందా? అంటూ వార్తలొస్తున్నాయి. దీనిపై తాజాగా స్పందించిన సైరా తరపు లాయర్ వందన క్లారిటీ ఇచ్చారు. అలాంటిదేమీ లేదని, పరస్పర అంగీకారంతోనే రెహమాన్ దంపతులు ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు.