AP: మూడు నెలల్లో విశాఖకు టీసీఎస్ వస్తుందని మంత్రి లోకేశ్ అసెంబ్లీలో వెల్లడించారు. ఐదు సంవత్సరాల్లో 5 లక్షల ఐటీ ఉద్యోగాలే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేయాలని టాటా గ్రూప్‌ను కోరినట్లు తెలిపారు. దేశంలోనే అతిపెద్ద కన్వెన్షన్ సెంటర్.. స్టార్ హోటళ్లు రాబోతున్నట్లు చెప్పారు. అలాగే, టీడీపీ హయాంలో 2014 నుంచి 2019 మధ్యలో సుమారు 150 కంపెనీలు 50 వేల మందికి ఉద్యోగాలు కల్పించినట్లు పేర్కొన్నారు.