KRNL: కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించిన నేపథ్యంలో ఎమ్మిగనూరు MLA డా.బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి గురువారం అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేశ్, ఎన్ఎండి ఫరూక్‌కు ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు జిల్లా ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు బెంచ్ ఏర్పాటు చేయడంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు.