నెల్లూరు: దగదర్తి మండల పరిధిలోని గ్రామాల్లో బెల్ట్ షాపులు నిర్వహిస్తే చర్యలు తీవ్రమవుతాయని దగదర్తి ఎస్ఐ జంపాని కుమార్ హెచ్చరించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. పేకాట, కోడి పందాలు ఆడిన బెల్ట్ షాపులు నిర్వహించిన సమాచారం ఇవ్వాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు. హెచ్చరికలను పట్టించుకోకుండా ఇష్టారీతిగా వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరించారు.