ప్రకాశం: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని తహసీల్దార్ సంజీవరావు కోరారు. తాళ్లూరులోని వికే ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం ప్రిన్సిపాల్ కొండపల్లి ఆంజనేయులు అధ్యక్షతన ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ హాజరై మాట్లాడుతూ.. ప్రజా స్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని, 18 సంవత్సరాలు నిండిన వారు ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు.