స్టాక్ మార్కెట్లలో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పతనం అవుతున్నాయి. అత్యధికంగా అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు 20 శాతం వరకు విలువ కోల్పోయింది. ఓ భారీ కాంట్రాక్టు పొందేందుకు 265 మిలియన్ డాలర్ల (రూ.2,029 కోట్లు) లంచాలు ఇవ్వజూపినట్లు అమెరికాలోని బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టు అభియోగాలు మోపడం దీనికి ప్రధాన కారణంగా నిలిచింది.