2050 నాటికి ప్రపంచ సంతానోత్పత్తి రేటు 1.8 శాతానికి తగ్గుతుందని అంచనాలున్నాయి. ఈ క్షీణత భారతదేశంతో పాటు పలు దేశాలకు సవాళ్లను అందిస్తుంది. 2021లో భారత్లో సుమారుగా 2 కోట్ల మంది పిల్లలు జన్మించారు. 2050 నాటికి 1.3 కోట్లకు తగ్గుతుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి. అయితే ఆలస్యంగా వివాహాలు జరగడం, ఉన్నత విద్యావకాశాలు పెరగడం, కుటుంబ నియంత్రణకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేవి సంతానోత్పత్తి రేటు తగ్గడానికి కారణాలు.