రాజమౌళి రాకతో హిట్ 2 పై భారీ హైప్ వచ్చింది.. చిత్ర యూనిట్ కూడా భారీగా ప్రమోట్ చేసింది. అడివి శేష్ అయితే ట్విట్టర్లో ఫ్యాన్స్‌కు రిప్లే ఇస్తూ.. క్రైమ్ కిక్ ఇస్తున్నాడు. ఇక థియేటర్లోకి వచ్చిన తర్వాత హిట్ టాక్ సొంతం చేసుకుంది. దాంతో వసూళ్ల పరంగా దూసుకుపోతోంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా 35 కోట్లకు పైగా వసూళ్లను అందుకున్నట్టు ట్రేడ్ వర్గాల టాక్. ఇలాగే ఉంటే.. త్వరలోనే 50 కోట్ల మార్కును టచ్ చేయడం ఖాయమంటున్నారు. అయితే హిట్2 రెస్పాన్స్ చూసి.. నెక్ట్స్ ఫ్రాంచైజ్ హిట్3 మరింత ఆసక్తికరంగా మారింది. పైగా క్లైమాక్స్‌లో నాని హీరో అని క్లారిటీ ఇచ్చేవారు. దాంతో విలన్ ఎవరు.. ఈ సారి ఎలాంటి క్రైమ్‌తో రాబోతున్నారనే చర్చ జరుగుతోంది. అందుకు తగ్గట్టే.. ఓ రేంజ్లో హైప్ ఇస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా డైరెక్టర్ శైలేష్ కొలను ‘చంపేద్దాం బ్రో.. పెద్దదే ప్లాన్ చేస్తున్నామని’ చెబుతున్నాడు. దాంతో హిట్ 3 పై రోజుకో న్యూస్ హల్ చల్ చేస్తోంది. రీసెంట్గా బాలకృష్ణ ఈ సినిమా చూసి.. టీమ్‌ను అభినందించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హిట్3ని సంథింగ్ స్పెషల్ ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. అందులోభాగంగా.. హిట్3లో బాలయ్య గెస్ట్ రోల్లో కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది. హిట్ ఫ్రాంఛైజ్ కోసం బాలయ్యను అడగ్గా.. చూద్దాం అని చెప్పారట. ఒకవేళ నిజంగానే.. బాలయ్య ఈ ప్రాజెక్ట్‌లో ఇన్వాల్వ్ అయితే మాత్రం.. నెక్ట్స్ లెవల్లో ఉంటుందని చెప్పొచ్చు. అయితే ఇప్పుడే దాని గురించి క్లారిటీ ఇవ్వడం కష్టం.