టాలీవుడ్(Tollywood)లో డైరెక్టర్ నీలకంఠ(Director Neelakanta) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మొదటి నుంచి నీలకంఠ విభిన్నమైన కథాంశాలతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ‘మిస్సమ్మ’ (Missamma Movie)వంటి విలక్షణమైన సినిమా చేసి ఆయన విజయం సాధించారు. కథలను, పాత్రలను నీలకంఠ డిజైన్ చేసే విధానం సరికొత్తగా ఉంటుంది. గత కొన్ని రోజులుగా ఆయన సినిమాలకు దూరంగా ఉన్నాడు. చాలా గ్యాప్ తర్వాత సర్కిల్ మూవీ(Circle Movie) చేస్తున్నాడు.
‘సర్కిల్’ మూవీ టీజర్ రిలీజ్:
సాయిరోనక్ హీరో(Hero saironak)గా శరత్ చంద్ర, సుమలత, వేణు బాబు ప్రధాన పాత్రల్లో ఈ మూవీ తెరకెక్కుతోంది. ‘ఎవరు ఎప్పుడు ఎందుకు శత్రువులవుతారో’ అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. ఇదొక రొమాంటిక్ మూవీగానూ ప్రేక్షకులను అలరించనుంది. మిస్సమ్మ సినిమా (Missamma Movie) చూసిన దానికంటే ఈ సినిమాను ఇంకాస్త ఎక్కువగానే ప్రేక్షకులు ఆదరిస్తారని మేకర్స్ తెలిపారు.
తాజాగా సర్కిల్ సినిమా(Circle Movie) నుంచి మేకర్స్ టీజర్‌ను రిలీజ్(Teaser Release) చేశారు. లవ్, యాక్షన్, రొమాన్స్ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. ఈ మూవీకి ప్రసు సంగీతాన్ని అందించారు. ఈ సినిమాలో రిచా పనై, అర్షిన్ మెహతా కథానాయికలుగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు మేకర్స్ తెలిపారు.