»Cine Hero Manchu Manoj Getting Second Marriage On March
Manchu Manoj Marriage మంచు మనోజ్ రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్
మనోజ్ కు ఇది వరకే ప్రణతి అనే అమ్మాయితో వివాహమైంది. వారి మధ్య విబేధాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉన్నాడు. అయితే మౌనిక-మనోజ్ మధ్య పరిచయం ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. ప్రస్తుతం కలిసి ఉంటున్నారని ఇండస్ట్రీలో టాక్.
సినీ పరిశ్రమకు మంచు మనోజ్ (Manchu Manoj) కుటుంబం దూరమైనట్టు కనిపిస్తోంది. వారి సినిమాలకు ఆశించిన ఫలితాలు (Success) దక్కకపోవడంతో సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే వారి కుటుంబానికి (Manchu Family) సంబంధించిన ఓ శుభవార్త తెలిసింది. యువ నటుడు మంచు మనోజ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలిసింది. ఎన్నాళ్లో నుంచి మనోజ్ రెండో పెళ్లి (Second Marriage)పై వినిపిస్తున్న మాట ఇప్పుడు వాస్తవం కాబోతున్నట్లు సమాచారం. మనోజ్ రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్ అయ్యిందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. వచ్చే నెలలో మనోజ్ నిరాడంబరంగా వివాహం చేసుకోబోతున్నాడట.
ఇటీవల తన కొత్త సినిమా (New Movie)ను మనోజ్ ప్రారంభించాడు. ఆ సినిమా ప్రారంభం సందర్భంగా మనోజ్ చేసిన ట్వీట్ అందరినీ ఆసక్తి గొలిపింది. జీవితంలో మరో స్టెప్ తీసుకోబోతున్నట్లు ప్రకటించాడు. అయితే ఆ అడుగు పెళ్లి అని అందరూ అనుకున్నారు. కానీ అది సినిమా ప్రారంభోత్సవం అని తేలడంతో ప్రేక్షకులు, మంచు అభిమానులు ఊసురు మన్నారు. అయితే అతడి పెళ్లి మాత్రం పక్కా అని మాత్రం చర్చ జరుగుతోంది. తాజాగా మనోజ్ పెళ్లికి ముహూర్తం ఫిక్సయ్యింది. మార్చి (March) 3వ తేదీన అతడు రెండో పెళ్లి చేసుకోబోతున్నాడట. ఈ విషయాన్ని మంచు కుటుంబం ప్రకటించకపోయినా ఇది మాత్రం ఫిక్ అని తెలుస్తున్నది. మనోజ్ చేసుకోబోయే అమ్మాయి ఎవరో కాదని.. భూమా నాగిరెడ్డి-శోభ దంపతుల కుమార్తె మౌనిక అని టాక్ నడుస్తోంది.
మొదటి నుంచి మనోజ్- మౌనిక (Bhuma Mounika) పెళ్లి వార్త వస్తోంది. మనోజ్ మాదిరి మౌనికకు కూడా రెండో పెళ్లి. వీరిద్దరూ కొంతకాలంగా సహజీవనం చేస్తున్నట్లు ఎప్పటి నుంచో టాక్ వినిపిస్తోంది. మనోజ్ కు ఇది వరకే ప్రణతి (Pranathi) అనే అమ్మాయితో వివాహమైంది. వారి మధ్య విబేధాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి ఒంటరిగా ఉన్నాడు. అయితే మౌనిక-మనోజ్ మధ్య పరిచయం ఎప్పటి నుంచో ఉంది. ఈ క్రమంలోనే వారి మధ్య ప్రేమ చిగురించింది. ప్రస్తుతం కలిసి ఉంటున్నారని ఇండస్ట్రీలో టాక్. తమ బంధాన్ని వివాహంతో అధికారికంగా జంటగా ఏర్పడాలని విస్తున్నారు. ఈ క్రమంలో వారి వివాహం వచ్చే నెలలో జరుగనుంది. ఇదే కనుక జరిగితే మంచు మనోజ్-మౌనిక జంట త్రిబుల్ ఎం (MMM) జోడీ కానుంది.