chiranjeevi: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ మూవీ బ్లాక్ బ్లస్టర్ హిట్ అందుకుంది. బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్‌కు హిట్ పడింది. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సినీ ప్రముఖులు ప్రభాస్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఆ జాబితాలో మొదటి వరసలో మెగాస్టార్ చిరంజీవి (chiranjeevi) నిలిచారు.
మై డియర్ దేవా ప్రభాస్‌కు (prabhas) హార్థిక అభినందనలు.. అంటూ చిరు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు కూడా అభినందనలు తెలిపారు. మీరు.. మరిన్ని, ఇలాంటి సినిమాలు చేయాలని ఆకాంక్షించారు. నటుడు ఫృథ్వీరాజ్ కుమార్, హీరోయిన్ శృతి హాసన్, జగపతిబాబు, వీసీ చలపతి, మ్యూజిక్ డైరెక్టర్ రవి బ్రసూర్, నిర్మాత కిరగండూర్కు అభినందనలు తెలిపారు.
సలార్ మూవీ బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ప్రభాస్ అభిమానులు ఆశించినట్టుగానే ఆ మూవీ ఉంది. ఉత్కంఠభరిత సన్నివేశాలు, హై టెక్నికల్ వ్యాల్యూస్, అద్భుతమైన స్క్రీన్ ప్రజెన్స్ వల్ల మూవీకి మరింత హైప్ వచ్చింది. చాలా రోజుల తర్వాత ప్రభాస్‌కు హిట్ పడింది.