»Charan Is Not The First Hero Of Game Changer Sensation Combo Miss
Ram charan : ‘గేమ్ ఛేంజర్’ ఫస్ట్ హీరో చరణ్ కాదట.. సెన్సేషన్ కాంబో మిస్!
Ram Charan : స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్నమూవీ గేమ్ ఛేంజర్ . ఈ సినిమా మొదలు పెట్టి చాలా రోజులే అవుతున్నా.. ఇప్పటి వరకు రిలీజ్ డేట్ లాక్ చేయలేదు.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న స్టార్ హీరోల సినిమాలన్నీ రిలీజ్ డేట్ లాక్ చేసే పనిలో ఉన్నాయి. కానీ ఆర్సీ 15నే ఈ విషయంలో వెనకబడిపోయింది. అయితే ఇప్పుడు దానిపైనే కసరత్తులు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇది అంతా ఇలా ఉండగా రీసెంట్ దిల్ రాజ్ కొన్ని వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ..
ఆర్ఆర్ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ కాస్త గ్లోబల్ స్టార్‌గా మారిపోయాడు. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌తో గేమ్ ఛేంజర్ అనే మూవీ చేస్తున్నాడు రామ్ చరణ్. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. పవర్ ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు శంకర్. అయితే దిల్ రాజు ఇచ్చిన లేటెస్ట్ స్టేట్మెంట్ ఒకటి సోషల్ మీడియాను షేక్ చేసేలా ఉంది. ఈ సినిమాలో హీరోగా శంకర్ ఫస్ట్ ఛాయిస్ రామ్ చరణ్ కాదట. ముందుగా ఈ కథను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో చేయాలని అనుకున్నాడట శంకర్. దిల్ రాజుకి స్టోరీ నరేట్ చేసినప్పుడు.. శంకర్ ఇదే విషయాన్ని చెప్పాడట. కానీ ఇలాంటి కథకు పవన్ కళ్యాణ్ కంటే రామ్ చరణ్ బాగుంటాడని దిల్ రాజు చెప్పడంతో.. శంకర్ కూడా ఓకే చెప్పారట. ఇదే విషయాన్ని లేటెస్ట్గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు దిల్ రాజు. ప్రస్తుతం దిల్ రాజు చేసిన కామెంట్స్ నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఒకవేళ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్ గానీ పడి ఉంటే.. అది ఏ రేంజ్లో ఉండేదో ఊహించుకోవచ్చు. అసలు చరణ్, శంకర్ కాంబో అన్నప్పుడే అంతా షాక్ అయ్యారు. ఇప్పటికీ ఇది నిజమేనా.. అని గిల్లి మరి చూసుకుంటున్నారు అభిమానులు. అలాంటిది పవన్‌తో శంకర్ సినిమా అంటే.. అదో సెన్సేషన్ ప్రాజెక్ట్ అయ్యేది. పవన్, శంకర్ కలిసి ప్రాజెక్ట్ చేసి ఉంటే.. బాక్సాఫీస్ దగ్గర సునామి వచ్చి ఉండేది. కానీ బాబాయ్ చేయాల్సిన సినిమాతో వండర్స్ క్రియేట్ చేసేందుకు వస్తున్నాడు అబ్బాయ్. వచ్చే సంక్రాంతికి లేదా సమ్మర్లో గేమ్ ఛేంజర్ మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏదేమైనా శంకర్, పవన్ కాంబో సెట్ అయి ఉంటే.. ఆ క్రేజ్ వేరే లెవల్లో ఉండేదని చెప్పొచ్చు.