దుల్కర్ సల్మాన్ నటించిన సూపర్ హిట్ మూవీ లక్కీ భాస్కర్ బాక్సాఫీస్ వద్ద మంచి కలక్షన్ సంపాదించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫాం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి టాప్ ప్లేస్‌లో దూసుకుపోతుందని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా వెల్లడిచింది. ఈ సినిమా 15 దేశాల్లో టాప్ 10 మూవీస్‌లలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిందని పేర్కొంది.