అసలే సాహో, రాధే శ్యామ్ సినిమాలు ఫ్లాప్ అవడంతో.. నిరాశలో ఉన్నారు ప్రభాస్ అభిమానులు. దాంతో బాహుబలి తర్వాత ఒక్క హిట్ పడితే చాలంటున్నారు. ప్రస్తుతం ప్రభాస్ లైనప్ కూడా సాలిడ్‌గా ఉండడంతో.. 2023 డార్లింగ్దేనని చెబుతున్నారు. ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ‘ఆదిపురుష్’ వచ్చే ఏడాది జూన్ 16న రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ హై ఓల్టేజ్ ప్రాజెక్ట్ ‘సలార్’ సెప్టెంబర్ 28న రాబోతోంది. ఆ తర్వాత 2024 ఆరంభంలో నాగ్ అశ్విన్ ‘ప్రాజెక్ట్ కె’ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సినిమాలపై భారీ అంచనాలున్నాయి. కానీ మధ్యలో మరో ప్రాజెక్ట్‌తో టెన్షన్ పడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. అసలు ఆ ప్రాజెక్ట్ వద్దని అంటుంటే.. ఇప్పుడు మరో టెన్షన్ పెట్టే న్యూస్ తెరపైకొచ్చింది. అఫిషీయల్ అనౌన్స్మెంట్ లేకపోయినా.. దర్శకుడు మారుతితో ప్రభాస్ ఓ సినిమా చేస్తున్నాడని చాలా రోజులుగా వినిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయిందని అంటున్నారు. కథ ప్రకారం దాదాపు 10 కోట్ల బడ్జెట్‌తో పాతకాలపు థియేటర్ సెట్ కూడా వేస్తున్నట్టుగా ఈ మధ్య వార్తలొచ్చాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ భూమిక జాయిన్ అవనున్నట్టు తెలుస్తోంది. అది కూడా ప్రభాస్ అక్కగా కనిపించనుందని టాక్. రాధే శ్యామ్‌లో ప్రభాస్ తల్లిగా సీనియర్ భామ భాగ్య శ్రీ నటించింది. దాంతో ఆమె ప్రభాస్ మదర్‌గా కంటే.. అక్కలా ఉందనే కామెంట్స్ వినిపించాయి. అందుకే ఇప్పుడు ప్రభాస్‌కు అక్కగా భూమిక సెట్ అవుతుందా.. అనే సందేహాలు వెలువడుతున్నాయి. అసలు మారుతి ప్రాజెక్ట్‌లో భూమిక నటిస్తుందో లేదో తెలియదు గానీ.. ఈ న్యూస్ మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.