Bandla Ganesh tweet : స్ఫూర్తినిచ్చే మాటలతో బండ్ల గణేష్ వరుస ట్వీట్లు
సినీ నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) వరుస ట్వీట్లతో సందడి చేస్తున్నారు. ఆయన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. ట్విట్టర్ లో రోజూ ఏదోక అప్ డేట్ పెడుతూ ఉంటారు. పవర్ స్టార్(Pawan Kalyan) భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ జనసేనాని గురించే ఎక్కువగా ట్వీట్లు చేస్తూ ఉంటారు.
సినీ నిర్మాత బండ్ల గణేష్(Bandla Ganesh) వరుస ట్వీట్లతో సందడి చేస్తున్నారు. ఆయన సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటారు. ట్విట్టర్ లో రోజూ ఏదోక అప్ డేట్ పెడుతూ ఉంటారు. పవర్ స్టార్(Pawan Kalyan) భక్తుడిగా చెప్పుకునే బండ్ల గణేష్ జనసేనాని గురించే ఎక్కువగా ట్వీట్లు చేస్తూ ఉంటారు. అయితే రెండు రోజుల క్రితం ఆయన మాస్ మహారాజ రవితేజ గురించి ట్వీట్లు చేశారు. ‘టైగర్ నాగేశ్వరరావు ఈజ్ స్లీపింగ్’ అని చెట్టు కొమ్మ మీద చిరుతపులి పడుకొని ఉన్న ఫొటోను బండ్ల గణేష్(Bandla Ganesh) ట్వీట్ చేయడం నెట్టింట వైరల్ అవుతోంది. ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలో రవితేజ హీరోగా నటిస్తున్నారు. అదేవిధంగా ‘విక్రమార్కుడు’ సినిమాలోని రవితేజ లుక్‌ను ట్వీట్ చేసిన బండ్ల గణేష్ ఓ కొటేషన్ పోస్టు చేశారు. ‘కళ్ళల్లో కసి మీసంలో పౌరుషం ముక్కు మీద రాజసం’ అని ట్యాగ్ ఇచ్చారు.
దీంతో చాలా మంది పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఫ్యాన్స్ బండ్ల గణేష్(Bandla Ganesh) ను ప్రశ్నించారు. ఏంటన్నా దేవరను వదిలేశావా అని అడగ్గా వారికి బండ్ల గణేష్ సమాధానం ఇచ్చారు. ఈ జన్మకు పవన్ కళ్యాణ్(Pawan Kalyan) తనకు దైవ సమానులు అని తెలిపారు. అయితే, నిన్నటి నుంచి బండ్ల గణేష్(Bandla Ganesh) ట్విట్టర్లో సూక్తి ముక్తావళి ప్రారంభించారు. ఎవరికో కొన్ని మంచి మాటలు బోధిస్తున్నట్టుగా స్ఫూర్తినిచ్చే మాటలను ట్విట్టర్లో షేర్ చేస్తున్నారు. ‘జీవితం ప్రశాంతంగా ముందుకు సాగాలంటే చాలా సందర్భాలలో అన్నీ అర్థమైనా అర్థంకానట్టు నటించాలి. ఒక్కోసారి ఎన్నో తెలిసినా ఏమీ తెలియనట్లు ఉండాలి. ఒక్కోసారి అవతలివారు చెప్పేది అబద్ధం అని తెలిసినా అవాక్కవ్వకుండా ఉండాలి. ఒక్కోసారి మనల్ని అవమానపరిచినా ఆభరణంగా ఫీలవ్వాలి..!’ అని బండ్ల గణేష్(Bandla Ganesh) బుధవారం రోజు ట్వీట్ చేశారు.
జీవితం ప్రశాంతంగా ముందుకు సాగాలంటే చాలా సందర్భాలలో అన్ని అర్థమైన అర్థం కానట్టు నటించాలి.. ఒక్కసారి ఎన్నో తెలిసినా ఏవి తెలియనట్లు ఉండాలి.. ఒక్కోసారి అవతలివారు చెప్పేది అబద్ధం అని తెలిసినా అవాక్కవ్వకుండా ఉండాలి.. ఒక్కోసారి మనల్ని అవమానపరిచినా ఆభరణంగా ఫీలవ్వాలి…….!
బండ్ల గణేష్(Bandla Ganesh) ఇలా చెప్పడంతో అది తన గురించి తానే చెప్పుకుంటున్నట్టు కొందరు కామెంట్స్ చేశారు. ‘గబ్బర్ సింగ్’ సినిమాకు తాను అనుకున్నంత రెమ్యూనరేషన్ నిర్మాత ఇవ్వలేదని ‘అన్‌స్టాపబుల్’ షోలో పవన్(Pawan Kalyan) చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై ఇప్పటికే బండ్ల గణేష్‌ను పవర్ స్టార్ ఫ్యాన్స్ ప్రశ్నలు వేస్తూ ట్వీట్స్ చేశారు. ఈ విషయం మీదే బండ్ల గణేష్(Bandla Ganesh) ఇప్పుడు సూక్తి ముక్తావళి ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చెబుతున్నారు.
ప్రతిసారి మోసపోవు కదా మరెందుకు అలా కూలబడిపోయావు..? లే.. ఈసారి ఎవరిని నమ్మకు అలాగని అందరి మీద కక్షకట్టకు జీవితం కదా..! ఒకేలా సాగిపోదు ఎన్నో ఎదురవుతాయి మరెన్నో నేర్పుతాయి……2
గురువారం కూడా వరుసగా రెండు స్ఫూర్తిదాయక మాటలను బండ్ల గణేష్(Bandla Ganesh) చెప్పారు. ‘ప్రతిసారి మోసపోవు కదా, మరెందుకు అలా కూలబడిపోయావు..? లే.. ఈసారి ఎవరినీ నమ్మకు, అలాగని అందరి మీదా కక్షకట్టకు, జీవితం కదా..! ఒకేలా సాగిపోదు, ఎన్నో ఎదురవుతాయి, మరెన్నో నేర్పుతాయి’ అని బండ్ల గణేష్(Bandla Ganesh) ట్వీట్ చేయడంతో అది కాస్తా వైరల్ అవుతోంది. ఆ తరవాత ఇంకో స్ఫూర్తి మాట చెప్పారు. ‘వాటన్నిటిని దాటుకొని ముందుకు వెళ్లడమే ఆట..! గెలుస్తావా.. ఓడిపోతావా తర్వాత, కానీ ఆట మధ్యలో ఆగిపోకు చివరి వరకు ఉండు. నీ ఓపిక రేపటి భవిష్యత్తుకి బలం’ అని మరో ట్వీట్ చేసి బండ్ల గణేష్(Bandla Ganesh) నెట్టింట హాట్ టాపిక్ అయ్యారు. ఈ ట్వీట్లు చేసిన తరవాత కూడా ‘అన్నా, పవన్ కళ్యాణ్(Pawan Kalyan) వేడి గురించేనా’ అని ఒక ఫ్యాన్ ప్రశ్నించడం విశేషం.
వాటన్నిటిని దాటుకొని ముందుకు వెళ్లడమే ఆట..! గెలుస్తావా.. ఓడిపోతావా తర్వాత, కానీ ఆట మధ్యలో ఆగిపోకు చివరి వరకు ఉండు. నీ ఓపిక రేపటి భవిష్యత్తుకి బలం 🔥