ఐక్యూ మూవీ(IQ Movie) ట్రైలర్‌ను టాలీవుడ్(Tollywood) స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) రిలీజ్ చేశారు. సాయి చరణ్, పల్లవి జంటగా ఐక్యూ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు ‘పవర్ ఆఫ్ ది స్టూడెంట్’ అనే ట్యాగ్ లైన్‌ను కూడా ఇచ్చారు. ఈ మూవీకి జిఎల్బి శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. కెఎల్పి మూవీస్ పతాకంపై కాయగూరల లక్ష్మీపతి ఈ సినిమాను నిర్మించారు. జూన్ 2వ తేదిన ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
‘ఐక్యూ’ మూవీ ట్రైలర్:
ట్రైలర్ విడుదల(Trailer Release) సందర్భంగా నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) మాట్లాడుతూ..టీడీపీ(TDP) కార్యక్రమాల్లో బిజీగా ఉన్నా ఐక్యూ సినిమా బృందం కోరిక మేరకు ట్రైలర్ లాంచ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సినిమాకు విజయం దక్కాలని మూవీ టీమ్‌ను ఆశీర్వదించారు. చక్కని సందేశంతో తెరకెక్కిన ఈ మూవీ నిర్మాతకు, నటీనటులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
జూన్ 2వ తేదిన ఐక్యూ మూవీ(IQ Movie)ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. సాయి చరణ్, పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో లేఖ ప్రజాపతి, ట్రాన్సీ, సుమన్, బెనర్జీ, సత్య ప్రకాష్, పి.రఘునాథ్ రెడ్డి, కె.లక్ష్మీపతి, సూర్య, గీతా సింగ్, ‘షేకింగ్’ శేషు, సత్తిపండు, సమీర్ దత్తా వంటివారు నటించారు.