Ashish Reddy: ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన తమ్ముడు శిరీష్ కుమారుడి వివాహాం నిశ్చయమైంది. శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డికి (Ashish Reddy) ఏపీకి చెందిన అద్విత రెడ్డితో గురువారం కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో ఎంగేజ్ మెంట్ జరిగింది. వీరి పెళ్లి ఫిబ్రవరిలో జరగనుంది. అద్విత తండ్రి వ్యాపార వేత్త అని తెలుస్తోంది. ఆశిష్ (Ashish Reddy) వరసగా సినిమాలు చేస్తున్నాడు. రౌడీ బాయ్స్ మూవీతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఇప్పుడు మరో రెండు మూవీస్ చేస్తున్నాడు. విశాల్ కాశీ దర్శకత్వంలో నటిస్తోన్న సెల్ఫిష్ మూవీ త్వరలో విడుదల అవనుంది. అందులో లవ్ టుడే ఫేమ్ ఇవానా కథానాయికగా కనిపించింది.